పొలంలోకి దూసుకెళ్లింది : పల్టీకొట్టిన RTC బస్సు

మిర్యాలగూడ :  RTC బస్సు బోల్తాపడటంతో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో జరిగింది. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో RTC బస్సు బోల్తా పడింది. ప్రకాశం జిల్లా కందుకూరు డిపోకు చెందిన RTC బస్సు గురువారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్‌ బయల్దేరింది. శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో బుగ్గబావిగూడెం సమీపంలోకి రాగానే ..వేగంతో వెళ్తున్న కంటైనర్‌ ను తప్పించే క్రమంలో బోల్తాపడి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అంతా బురదమయంగా ఉండటంతో పలువురు ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గాయపడ్డవారిని మిర్యాలగూడ హస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సు బురదలోకి దూసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. ఇప్పటివరకు మాత్రం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

Latest Updates