జనజాగృతి ఇక బీజేపీలోకి

ఢిల్లీ: ఏపీకి చెందిన అరకు మాజీ ఎంపీ, జనజాగృతి పార్టీ వ్యవస్థాపకురాలు  కొత్తపల్లి గీత నేడు బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్  సమక్షంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ను కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షా.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి అరకు ఎంపీగా విజయం సాధించిన ఆమె.. ఆ తర్వాత ఆ పార్టి నుంచి బయటకు వచ్చి 2018లో జనజాగృతి అనే కొత్త పార్టీ స్ధాపించారు. ఈ రోజు బీజేపిలో చేరిన తర్వాత తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధిష్టానం మేరకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని ఆమె అన్నారు.

Latest Updates