సర్కారు వారి స్టైలిష్ విలన్.?

దళపతి, రోజా వంటి సినిమాల్లో అరవింద్ స్వామిని చూసి మనసు పారేసుకోని అమ్మాయి లేదు. హ్యాండ్‌ సమ్ హీరోగా అప్పట్లో చాలా క్రేజ్ సంపాదించాడాయన. ఆ తర్వాత అవకాశాలు తగ్గినా.. కాస్త గ్యాప్‌ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్టు గారీ ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యం గా నెగిటివ్‌ రోల్స్‌ తో మెప్పిస్తున్నాడు. ‘ధృవ’ సినిమాలో స్టైలిష్ విలన్‌ గా అందరినీ ఇంప్రెస్ చేయడంతో.. ఆ తర్వాత అలాంటి పాత్రలు తనని వెతుక్కుంటూ వస్తున్నాయి. ‘సర్కారువారి పాట’లో కూడా అరవింద్‌‌నే విలన్‌ గా తీసుకున్నట్లు తెలుస్తోంది . మహేశ్ బాబు, పరశురామ్ కాం బినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక ఇంటెలిజెంట్‌ ప్లే ఉంటుందట. అలాంటి కథకి ఓ స్టైలిష్‌‌ విలన్‌ అయితేనే బాగుంటుందట. ఇప్పటికే ఉపేంద్ర, సుదీప్‌ లాంటి వారి పేర్లు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా అరవింద్‌‌ స్వామి పేరు తెరపైకొచ్చింది . అయితే టీమ్ కన్ఫర్మ్ చేస్తే తప్ప ఇదయినా నిజమో కాదో క్లారిటీ రాదు. కీర్తి సురేష్‌‌ హీరోయిన్​గా నటిస్తున్న ఈ మూవీ మొత్తం బ్యాంక్‌ స్కామ్స్‌ చుట్టూ తిరుగుతుంది . మహేష్ ఓ ఎన్నారైగా కనిపిస్తాడని, అందుకే మేజర్‌‌‌‌ పార్ట్‌‌ని యూఎస్‌‌లో తీయనున్నారని తెలుస్తోంది.

Latest Updates