‘ఖేల్‌‌రత్న’కు జ్యోతి సురేఖ

అర్జునకు సాత్విక్ ‌‌సాయిరాజ్‌‌

న్యూఢిల్లీ: తెలుగు ఆర్చర్ ‌‌వెన్నం జ్యోతి సురేఖ ప్రతిష్టాత్మక  రాజీవ్‌‌గాంధీ ఖేల్‌‌రత్న అవార్డు రేసులో నిలిచింది. దశాబ్ద కాలంలో 33 ఇంటర్నేషనల్‌‌ మెడల్స్‌ ‌నెగ్గిన 24 ఏళ్ల సురేఖ పేరును ఆంధ్రప్రదేశ్ ‌‌ప్రభుత్వం మంగళవారం ఈ అవార్డుకు నామినేట్‌‌ చేసింది. ఇండియా డబుల్స్‌‌ స్టార్ ‌‌షట్లర్‌‌, ఏపీ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్‌‌, అతని పార్ట్‌‌నర్ ‌‌చిరాగ్‌‌షెట్టి అర్జున బరిలో నిలిచారు. వీరిద్దరితో పాటు  సింగిల్స్‌‌ యువ షట్లర్ ‌‌సమీర్‌‌వర్మ పేరును బ్యాడ్మింటన్‌‌ అసోసియేషన్‌ ‌అర్జునకు నామినేట్‌‌చేసింది. చేతన్ ‌‌ఆనంద్‌‌, సైనా నెహ్వాల్‌‌, కశ్యప్ ‌‌తదితరులకు కోచింగ్‌‌ ఇచ్చిన ఇండియా మాజీ కోచ్‌‌ భాస్కర్‌ ‌బాబు ద్రోణాచార్య రేసులో నిలిచాడు. ఇక, ఇండియా వుమెన్స్‌‌ హాకీ టీమ్ ‌‌కెప్టెన్ ‌‌రాణి రాంపాల్‌‌, టేబుల్ ‌‌టెన్నిస్ ‌‌స్టార్ ‌‌మనికా బాత్రా పేర్లను హాకీ ఇండియా, టీటీ ఫెడరేషన్లు ఖేల్‌‌రత్నకు రికమెండ్ ‌‌చేశాయి. వందన కటారియా, మోనికాతోపాటు మెన్స్‌‌టీమ్ ‌‌డ్రాగ్‌‌ఫ్లిక్ ‌‌స్పెషలిస్ట్ ‌‌హర్మన్‌‌ ప్రీత్‌‌సింగ్ ‌‌పేర్లను  హాకీ ఇండియా అర్జున అవార్డుకు నామినేట్‌‌చేసింది.

For More News..

రైతుల దగ్గర ఏ పంటలూ కొనం

పండులో పటాకులు పెట్టి.. దాన్ని ఏనుగుకు పెట్టి..

మొబైల్ కంపెనీలకు సూపర్​ ఆఫర్

ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు

Latest Updates