అర్ధకుంభమేళాకి మహాశివరాత్రి శోభ

అర్ధకుంభమేళాలో ఇవాళ శివరాత్రి పర్వదినం సందర్భంగా చివరి షాహి స్నాన్ కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ సంగమానికి చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచే భక్తులు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమానికి భారీగా వచ్చారు. ఇవాళ శివరాత్రి కావడం, అందులోనూ సోమవారం ఈ పర్వదినం రావడం, ఆఖరి షాహిస్నాన్ కావడంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఇవాళ లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇప్పటి వరకు అర్ధ కుంభమేళాలో 22 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు.

శివరాత్రి తెల్లవారుజాము 1 గంట 26 నిమిషాల నుంచి త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడింది. ఇవాళ ఒక్కరోజే 50 లక్షల మంది వరకు భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. పెద్ద సంఖ్యలో జనం వస్తుండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 15 జనవరి మకర సంక్రాంతి నుంచి కుంభమేళా ప్రారంభమైంది. తొలి షాహి స్నాన్ మకర సంక్రాంతి రోజున ముగియగా, ఫిబ్రవరి 4న మౌని అమావాస్య రోజు రెండో షాహి స్నాన్, ఫిబ్రవరి 10న వసంతపంచమి సందర్భంగా మూడో షాహి స్నాన్ పూర్తయ్యాయి. వీటితో పాటే 19న మాఘీ పూర్ణిమ, ఫిబ్రవరి 21న పౌష్ పూర్ణిమ, ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా చివరి షాహి స్నాన్ ఘట్టం జరుగుతోంది.

Latest Updates