మీకు నలబై ఏళ్లు వస్తున్నాయా..?

వయసు నలభైల్లోకి అడుగు పెడుతోందీ అంటే.. మన బాడీ మీద శ్రద్ద పెట్టాల్సిన టైమ్​ వచ్చిందన్న మాటే. నలభై ఏళ్లు దాటితే మెంటల్ స్ట్రెస్, బాడీ మీద పడే ఒత్తిడీ రెట్టింపు అవుతాయి. అందుకే అప్పటివరకూ ఉండే లైఫ్​స్టైల్ లో మార్పులు చేసుకోవాలి. ఫుడ్ కావచ్చు, డైలీ రొటీన్ ప్లాన్ కావచ్చు.. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మిగతా లైఫ్​ని ప్రశాంతంగా గడపొచ్చు.

ఎర్లీ ఫార్టీస్ లోనే సరైన డైట్ అవసరం. ముఖ్యంగా మగవాళ్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేవి తీసుకుంటూ జంక్​ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లని మానెయ్యటం.. లేదంటే తగ్గించటం చెయ్యాల్సిందే. మొదట్లోనే తీసుకునే ఈ జాగ్రత్తలు మిగతా నలభయ్యేళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

మారాల్సిందే..

ఇరవయ్యేళ్ల వయసులో ఉండే అలవాట్లు ముప్పైలలో పనికి రావు. అలాగే ముప్పైయేళ్లలో ఉండే ఫుడ్ హ్యాబిట్స్ నలభై తర్వాత కంటిన్యూ చేయాలనుకుంటే సమస్యలు తప్పవు. నిద్ర, రెస్ట్ లెస్ గా పని చేయటం, స్ట్రెస్ మేనేజ్​మెంట్, డైజెషన్ ఫ్రెండ్లీ ఫుడ్ ఇవన్నీ మారకుంటే మిగతా లైఫ్ లీడ్ చేయటం లో చాలా సమస్యలు వస్తాయి.

ఆహారం తీసుకునే అలవాట్లు

నలభయ్యేళ్లలోకి అడుగు పెట్టామంటే మన బాడీలో కొత్త సెల్స్ తయారు కావు. మెటబాలిజంలో కూడా మార్పులు వస్తాయి. అందుకే తినేవాటిలో ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్, ఐరన్ కచ్చితంగా రోజూ అందేలా చూసుకోవాలి. ఫ్రూట్స్, నట్స్ డెయిలీ రొటీన్​లో భాగం చేసుకోవటం, వాటర్ ఎక్కువగా తీసుకోవటం కూడా అవసరం.

నిద్ర

వయసులో ఉన్నప్పుడు తెలియదు కానీ నిద్ర లేకపోవటం నలభై ఏళ్లు దాటాక మన హెల్త్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఒబెసిటీ, గుండె సమస్యలు, హైబీపీ, డయాబెటిస్ లాంటివి నిద్రతోనే ముడిపడి ఉంటాయి. అలాగే నిద్ర ఎక్కువైనా, తక్కువైనా గుండెకు మంచిది కాదని, రోజుకు నాలుగు గంటలు నిద్రపోయే వారికి, ఎనిమిది గంటలకంటే ఎక్కువసేపు నిద్రపోయేవాళ్లలో కూడా బాడీ మెటబాలిజం లో తేడాలు వస్తాయన్నది డాక్టర్ల మాట.

వర్కవుట్స్

నడక, మినిమం చేయాలిన వర్కవుట్స్ ఫాలో అవ్వాల్సిన వయసు ఇదే. ఇప్పటివరకూ ఆరోగ్యాన్ని లైట్ తీసుకున్నట్టుగా నలభై దాటాక కూడా ఉండటం కుదరదు. కొద్దిగా వర్కవుట్స్, ముప్పైనిమిషాల బ్రిస్క్ వాకింగ్ అలవాటు చేసుకోవాలి. ఆఫీసుల్లో ఎక్కువగా కూర్చుని పని చేసేవాళ్లకి నడవడం, ఎండ తగలడం అవసరం అని మర్చిపోవద్దు.

Latest Updates