గచ్చిబౌలి ఇండ్ల స్కామ్‌పై చర్చకు రెడీనా?

ఉద్యోగ సంఘాలకు రిటైర్డ్ టీచర్స్ ఎంప్లాయీస్ ఆఫ్ బీజేపీ సెల్ సవాల్

హైదరాబాద్, వెలుగు:టీఎన్జీవో, టీజీవో నేతలు అర్హత లేకున్నా గచ్చిబౌలిలో ఇండ్ల స్థలాలు తీసుకొని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్ర రిటైర్డ్ టీచర్స్ ఎంప్లాయీస్ ఆఫ్ బీజేపీ సెల్ కో చైర్మన్ తిరువరంగం ప్రభాకర్ ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నేతలపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని జిల్లాల నాయకులకు జేఏసీ నేతలు ఆదేశాలు ఇచ్చారన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు తిరువరంగం ప్రభాకర్ శనివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. గచ్చిబౌలి ఇళ్ల స్కామ్ పై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని టీఎన్జీవో, టీజీవో నేతలకు సవాల్ విసిరారు. ఉద్యోగ సంఘాల నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి, వెంటనే పీఆర్సీ ఇప్పించాలని డిమాండ్ చేశారు.

 

Latest Updates