టీఆర్ఎస్ లో నాయకుల మధ్య విభేదాలు… సారీ చెప్పిన కలెక్టర్

ఎర్రబస్సు ఎక్కి రాలేదు.. రివ్యూ మీటింట్ అంటే ఫొటోలు దిగడంకాదు: ఎమ్మెల్యే శంకర్ నాయక్
రాద్దాంతం అనవసరం సమస్యలు చెప్పండి: మంత్రి సత్యవతి రాథోడ్
ఎమ్మెల్యేకు సారీ చెప్పిన కలెక్టర్

మహబూబాబాద్: అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు, అదేపార్టీకి చెందిన మంత్రి సత్యవతి రాథోద్ మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం మహబూబాబాద్ లో ఎస్సారెస్పీపై సమీక్షనిర్వహించారు మంత్రి సత్యవతీ రాథోడ్. ఇందులో జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి లేటుగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్.. తాను రాకుండానే మీటింట్ ఎలా మొదలు పెడతారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే రాకుండానే ఎస్సారెస్పీపై సమీక్ష ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు శంకర్ నాయక్. స్థానిక సమస్యలు మీకు తెలుసా అని మంత్రి సత్యవతి రాథోడ్ ను ప్రశ్నించారు. తాను ఆర్ఏసీలో చదువుకున్నానని ఎర్రబస్సు ఎక్కిరాలేదని చెప్పారు. రివ్యూ మీటింగ్ అంటే ఫొటోలు దిగటంకాదంటూ సెటైర్లు వేశారుశంకర్ నాయక్. దీంతో అనవసర రాద్ధాంతం ఎందుకని అన్నారు సత్యవతి రాథోడ్. నాయకుల మధ్య మాటల యుద్దం జరుగుతుండటంతో అక్కడే ఉన్న అధికారులు బిత్తరపోయారు. ఇద్దరినీ శాంతింప చేయడానికి కలెక్టర్ గౌతమ్ ఎమ్మెల్యేకు సారీ చెప్పారు.

Latest Updates