అవేంజర్స్ దెబ్బకి వెనక్కి తగ్గిన నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా మరోసారి వాయిదా పడింది. మే-1న రిలీజ్ అవుతుందని ఇటీవల ప్రకటించగా..గురువారం మళ్లీ వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేసింది యూనిట్. హాలీవుడ్ క్రేజీ మూవీ అవేంజర్స్ గేమ్స్ ఏప్రిల్-26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకే మల్టీఫ్లెక్స్ లు ఫుల్ అయ్యాయని ..దీంతో అర్జున్ సురవరం సినిమాను వాయిదా వేస్తున్నామని హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు.ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అర్జున్ సురవరం సినిమాకు సెన్సార్‌ బోర్డు క్లీన్‌ u/a సర్టిఫికేట్‌ ఇచ్చింది.

థియేట్రికల్‌ హక్కులను కూడా దక్కించుకున్నామని తెలిపిన యూనిట్.. సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పింది. నిర్మాతలకు నష్టం రావద్దనే ఉద్దేశంతోనే సినిమాను వాయిదా వేస్తున్నామని తెలిపిన నిర్మాతలు..మహర్షి తర్వాతనే అర్జున్ సురవరాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని తెలిపింది సినిమా యూనిట్. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటించగా..TS సంతోష్ డైరెక్టర్.

 

 

Latest Updates