ఒక బాధితుడిలా కాదు… ఒక రిపోర్టర్‌లా ఆలోచించాలి

‘కనితన్’ పేరుతో తమిళంలో విడుదలైన సినిమాను నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా ‘అర్జున్ సురవరం’ పేరుతో టి. సంతోష్ తెలుగులో తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తయినా ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఎప్పటినుంచో విడుదలకు నోచుకోవడం లేదు. తాజాగా ఈ సినమా ట్రైలర్‌ను మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్‌లో చిత్రం బృందం విడుదల చేసింది. పైరసీని అరికట్టాలనే ఉద్దేశంతోనే ట్రైలర్‌ను కూడా థియేటర్‌లోనే విడుదల చేశారు చిత్ర యూనిట్. హీరో నిఖిల్ తాను నటించిన 17 సినిమాలలో ఏ సినిమాకు ఇంతగా కష్టపడలేదని ఆయన అన్నారు.

ఈ సినిమాలో హీరో నిఖిల్ ఒక రిపోర్టర్ పాత్రలో నటిస్తున్నారు. విద్యారంగంలో మనకు తెలియకుండా జరుగుతున్న స్కామ్‌లను బయటపెట్టె క్రమంలో అర్జున్ ఎదుర్కొన్న సంఘటనలతో ఈ సినిమా సాగుతుంది. ఠాగూర్ మధు సమర్పణలో ఆకెళ్ల రాజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సత్య, తరుణ్ అరోరాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కేవలం 12 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ రాబట్టడం విశేషం.

Latest Updates