పీవోకేలో టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ నేలమట్టం చేసిన భారత ఆర్మీ

  • నలుగురు పాక్ ఆర్మీ సైనికులకు కూడా మృతి

కుప్వారా: పాకిస్థాన్ ని దెబ్బకు దెబ్బ కొట్టింది భారత ఆర్మీ. మరోసారి పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల క్యాంపులు, లాంచ్ ప్యాడ్ లను నేలమట్టం చేసింది. ఆర్టిలరీ ఆయుధాలతో పీవోకేలో ఉన్న నాలుగైదు లాంచ్ ప్యాడ్ లను ధ్వంసం చేసింది. నలుగురు పాక్ సైనికుల్ని కూడా మట్టుబెట్టింది.

ఇవాళ ఉదయం భారత సేనల దృష్టి మరల్చి.. ఉగ్రవాదుల్ని సరిహద్దు దాటించాలన్న కుట్రతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ కాల్పులకు దిగింది. తంధార్ సెక్టార్ లో జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు, ఒక సామాన్యుడు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని తిప్పికొట్టేందుకు భారత ఆర్మీ రంగంలోకి దిగింది. స్ట్రాంగ్ కౌంటర్ మొదలుపెట్టింది. ఆర్టిలరీ ఆయుధాలతో తంధార్ సెక్టార్ ఆవలి వైపు పీవోకేలోని నీలం లోయలో ఉన్న ఉగ్రవాదుల క్యాంపుల్ని టార్గెట్ చేసింది. అక్కడున్న వాటి లాంచ్ ప్యాడ్స్ ను నేటమట్టం చేసింది మన అర్మీ. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురైదుగురు పాక్ సైనికులు కూడా మరణించినట్లు సమాచారం అందుతోంది. ఉగ్రవాదుల్ని భారత్ లోకి పంపే ప్రయత్నంలో తన సైనికుల్ని కోల్పోయింది పాక్.

Latest Updates