కాల్పులు జరిపాం… 10మంది పాక్ సైనికులు చనిపోయారు: రావత్

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్టిల్లరీ గన్స్ తో దాడి చేశామన్నారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన… ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి బోర్డర్ వెంబడి చొరబాటు యత్నాలు పెరిగాయన్నారు. జమ్మూకశ్మీర్ లో శాంతి-సామరస్యాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఉగ్రవాద క్యాంపులకు తీవ్ర నష్టం కలిగించామన్నారు. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో 6 నుంచి 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని… అంతే సంఖ్యలో ఉగ్రవాదులు కూడా చనిపోయారని చెప్పారు. 3 టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేశామన్నారు.

 

Latest Updates