హింసని రెచ్చగొట్టడం నాయకత్వం కాదు: ఆర్మీ చీఫ్

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బహిరంగంగా స్పందించారు. నాయకులే హింసను రెచ్చగొడుతున్నారంటూ ఆయన తప్పుబట్టారు. ఇటువంటి పనులు చేయడం నాయకత్వ లక్షణాలు కాదని అన్నారు. లీడర్‌షిప్ అనేది ఈజీ కాదని, ప్రజల్ని సరైన దారిలో నడిపించేవాడే నిజమైన నాయకుడని చెప్పారు.

గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్మీ చీఫ్ ప్రజలను తప్పుదారిలో నడిపించేవాడు నాయకుడు అనిపించుకోలేడని అన్నారు. ‘నాయకులు ప్రజల్ని ఎలా పెడదోవ పట్టిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఇటీవల యూనివర్సిటీలు, కాలేజీల విద్యార్థులు భారీ సంఖ్యలో నిరసనలు చేస్తున్న తీరు చూస్తున్నాం. సిటీలు, టౌన్లలో జనాల్ని తప్పుదారి పట్టించి హింసను రెచ్చగొడుతున్నారు. ఇది నాయకత్వం అనిపించుకోదు’ అని అన్నారు బిపిన్ రావత్.

Latest Updates