మేం దేనికైనా రెడీ: ఆర్మీ చీఫ్ నరవాణే

న్యూఢిల్లీ: ఏ దాడులను ఎదుర్కోవడానికైనా తాము సిద్ధమేనని భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే గురువారం స్పష్టం చేశారు. బాహ్య దాడులతోపాటు అంతర్గత అటాక్స్‌‌ను తిప్పి కొట్టడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. యానువల్‌‌ ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లో పాల్గొన్న ముకుంద్ శత్రువుల దాడులను ఎదుర్కోవడానికి ఆర్మీ సంసిద్ధంగా ఉందన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ నార్తర్న్ బార్డర్స్‌‌లో ఎదురైన చాలెంజ్‌లను దీటుగా ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. చైనాతో ఉద్రిక్తతలకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ అనివార్య ఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చినా అందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నామని వివరించారు. టెక్నాలజీ వినియోగంతో ఆర్మీని బలోపేతం చేస్తున్నామని, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఫేజ్ చేయడానికి ఇదెంతో ఆవశ్యకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Latest Updates