ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన ఆర్మీ

జమ్మూ: ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి ఇండియాలో చొరబడాలని చూసిన టెర్రరిస్టులను ఆర్మీ సైనికులు మట్టుపెట్టిన ఘటన సోమవారం జరిగింది. జమ్మూ కశ్మీర్, నౌషెరా సెక్టార్ లోని రాజౌరీ జిల్లా గుండా ఇండియాలోకి రావడానికి ట్రై చేసిన ముగ్గురు టెర్రరిస్టులను చంపినట్లు ఆర్మీ తెలిపింది. టెర్రరిస్టులు ఇండియాలోని ఏ భూభాగంలో ప్రవేశించారో అక్కడే వారిని మట్టు బెట్టామని ఓ ఆర్మీ ఆఫీసర్ చెప్పారు.

ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు ముందస్తు సమాచారం అందడంతో ఆర్మీ అప్రమత్తం అయింది. జమ్మూ కశ్మీర్ లోని హీరానగర్ తోపాటు, కథువా–సాంబా సెక్టార్ లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ ఎఫ్) సెర్చ్ ఆపరేషన్స్ ను ప్రారంభించింది. ఇంటర్నేషనల్ బార్డర్ తోపాటు జమ్మూ‌‌-పాథాన్ కోట్ హైవేల వద్ద చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసింది. గత కొన్ని సంవత్సరాల్లో హీరానగర్, సాంబా సెక్టార్ల గుండా టెర్రరిస్టులు ఇండియాలో చొరబడి ఆ ప్రాంతాల్లోని ఆర్మీ క్యాంపులు, పోలీస్ స్టేషన్స్ పై దాడులు చేసిన ఘటనలు చాలా జరిగిన నేపథ్యంలో ఆర్మీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Latest Updates