ఇండియాలో ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్

ఇండియాలో తొలిసారి ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్ జరగబోతున్నాయి. వచ్చే ఆగష్టులో తొమ్మిది రోజుల పాటు రాజస్థాన్ లోని జైసల్మీర్ లో ఈ పోటీలు జరుగుతాయని మంగళవారం ఆర్మీ ప్రకటించింది. తొలిసారి ఇండియన్ టీమ్ ఇందులో పాల్గొననుంది. టోర్నీలో  32 గేమ్స్ రష్యా, ఇండియా, చైనా, అజర్ బైజాన్, ఆర్మేనియా, బెలారస్, ఇరాన్, మంగోలియా, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ లో జరుగుతాయని చెప్పింది. ఇండియాలో ‘ఆర్మీ ఇంటర్నేషనల్ స్కౌట్ మాస్టర్స్ కాంపిటీషన్’ జరుగుతుందని వివరించింది. ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్ ను రష్యా 2015లో మొదలుపెట్టింది. 32 దేశాల ఆర్మీ టీమ్స్ పోటీ పడుతుంటాయి.