యువతి ట్రాప్ లో జవాన్: ఆర్మీ రహస్యాలు లీక్

ఆర్మీకి చెందిన రహస్య సమాచారాన్ని ఓ విదేశీ మహిళతో పంచుకున్నాడన్న కారణంతో  ఆర్మీ జవాన్ ను అరెస్ట్ చేశారు హర్యాణా పోలీసులు. రవిందర్ కుమార్(21) అనే ఆర్మీ జవాన్ కు సోషల్ మీడియాలో ఓ అమ్మాయి పరిచయం అయింది. ఆమెతో పలు సార్లు ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేసిన రవిందర్ తనను తాను ఆర్మీలో పని చేస్తున్నట్టు చెప్పాడు. దీంతో  ఆమె అడిగిన వెంటనే ఆర్మీకు చెందిన వెపన్స్ ను, మ్యాప్ లను ఫొటో తీసి మొబైల్ ఫోన్ ద్వారా పంపించాడు. అయితే అతని ఫోన్ చాటింగ్ పై పోలీస్ ఇంటలీజెన్స్ నిఘా పెట్టింది. విషయాన్ని దృవీకరించుకున్న తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. అంతలోనే రవిందర్ ఐదు రోజుల సెలవులపై సొంత రాష్ట్రమైన హర్యాణాకు జులై10న బయలు దేరాడు.

రవిందర్ ఓ డాబాలో ఉండగా పట్టుకున్నట్లు చెప్పారు నార్నల్ ఎస్పీ చందర్ మోహన్. అతని దగ్గర నుంచి 7 లైవ్ కార్ట్ ట్రిడ్జెస్, రెండు మోబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.  ఆ అమ్మాయి నుంచి రవిందర్ బ్యాంక్ ఎకౌంట్ కు 5వేల రూపాయలు ట్రాన్వర్ అయినట్లు పోలీసులు తెలిపారు. అతను మార్చ్ 2017లో ఆర్మీలో చేరినట్లు చెప్పారు. రవిందర్ తో చాటింగ్ చేసిన మహిళ ఏ దేశానికి చెందినదో ఇంకా తెలువలేదని… తాము మాత్రం ఆమెను పాకిస్తాన్ కు చెందిన యువతిగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు.