పాక్ రేంజర్ల కాల్పుల్లో ఆర్మీ జవాన్ మృతి

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ బోర్డర్ లో రెచ్చిపోయింది. ఇవాళ జరిపిన కాల్పులలో భారత ఆర్మీ జవాన్ నాయిక్ రవి రంజన్ కుమార్ సింగ్ మరణించారు. జమ్మూకశ్మీర్ లోని కృష్ణా ఘాటి (కేజీ) సెక్టార్లో భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు పాక్ రేంజర్లు. భారత బలగాలు వెంటనే స్పందించి పాక్ కు దీటుగా బదులిచ్చాయి. ఇటీవల కాలంలో పాక్ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది.

Latest Updates