సరిహద్దుల్లో పాక్ కాల్పులు.. ఓ జవాన్ మృతి

రాజౌరి: దాయాది పాకిస్తాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్, రాజౌరి సెక్టార్‌‌లోని నౌషెరా సెక్టార్‌‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత ఆర్మీకి చెందిన హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ చనిపోయారు. ‘పాక్ కాల్పులకు మన జవాన్లు దీటుగా బదులిచ్చారు. ఈ ఘటనలో హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన మృతి చెందారు. హవల్దార్ శివాజీ అసమాన ధైర్య, సాహసాలను ప్రదర్శించారు. విధి నిర్వహణలో ఆయన వీర త్యాగాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు’ అని  ఆర్మీ పేర్కొంది.

Latest Updates