మంచుకొండ‌ల్లో చిక్కుకుని తెలంగాణ‌ జవాను వీర‌మ‌ర‌ణం

కుమురం భీం జిల్లా : లడఖ్‌లో తెలంగాణ‌ జవాను వీర‌మ‌ర‌ణం పొందాడు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ షాకీర్ హుస్సేన్ (35) ఆర్మీలో పనిచేస్తున్నారు. లడఖ్‌లో విధులు నిర్వహిస్తున్న షాకీర్  మంచుకొండ చెరియల్లో చిక్కుకుని మృతి చెందారు. ఆ స‌మ‌యంలో ఆరుగురు ఆర్మీ జవాన్లు కొండ చ‌రియల్లో చిక్కుకున్నారు. దుర‌దృష్ట వ‌శాత్తు ఆ ప్ర‌మాదంలో షాకీర్ హుస్సేన్ చెందారు. షాకీర్ మ‌ర‌ణ‌వార్త‌తో అత‌ని కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Latest Updates