చైనా విషయంలో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని మోడీ

  • ఇండియాపై కన్నేసిన వారికి గుణపాఠం చెప్పినం
  • మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదు
  •  ఇండియాకు శాంతి, స్నేహంకావాలి.. కానీ సార్వభౌమాధికారమే సుప్రీం
  • వీడియో కాన్ఫరెన్స్ లో ఆల్ పార్టీ మీటింగ్ ప్రధానికి మద్దతు తెలిపిన మమత, మాయావతి, ఉద్ధవ్, కేసీఆర్, వైఎస్ జగన్

 

మన దేశ భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని, మన సైనిక పోస్టులను ఎవరూ అక్రమించుకోలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘20 మంది జవాన్లు చనిపోయారు. కానీ ఇండియాపై కన్నేసిన వారికి గుణపాఠం చెప్పారు” అని చెప్పారు. ఇండియా, చైనా బార్డర్ పరిస్థి తిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆల్ పార్టీమీటింగ్ నిర్వహించారు. గల్వాన్ లోయలో జరిగిన గొడవలో చనిపోయిన 20 ఇండియన్ సోల్జర్ల కు నివాళులర్పించిన తర్వాత మీటింగ్ స్టార్ట్ చేశారు. సరిహద్దు గొడవ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ , విదేశాంగ మంత్రి జై శంకర్.. వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో మేజర్ పొలిటికల్ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. సరిహద్దు గొడవపై ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని ప్రతిపక్షాలు కోరాయి. పరిస్థితిని హ్యాండిల్ చేయడంలో సర్కారు తీరును కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు విమర్శించాయి. మోడీని మమత బెనర్, ఉద్థవ్ థాక్రే, మాయవతి సపోర్ట్ చేశారు. పీఎం ఏ వ్యూహం అనుసరించినా మద్దతిస్తామని ఏపీ సీఎం జగన్ చెప్పారు. టెన్షన్లు తగ్గించేందుకు డిప్లమాటిక్ మార్గాలను అనుసరించాలని ఎన్సీపీ నేత శరద్ పవార్ కోరారు.

 దేశం బాధపడింది.. కోపంగా ఉంది..

‘‘దేశాన్ని కాపాడేందుకు ఏం చేయాలో అదే సోల్జర్ లు చేస్తున్నారు. అది మోహరింపు కావచ్చు.. యాక్షన్ కావచ్చు.. కౌంటర్ యాక్షన్ కావచ్చు. మన భూమిపై కన్నేయాలన్న ఆలోచన కూడా ఎవరికీ రానంత సా మర్ ్థయంమనకు ఉంది” అని ప్రధాని మోడీ వివరించా రు. అవసరమైన చర్యలు చేపట్టేందు కు ఆర్మీకి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. చైనా వాళ్లు చేసిన పనితో దేశం మొత్తం బాధపడిందని, కోపంగా ఉందని అన్నారు. ఇండియాకు శాంతి, స్నేహం కావాలని, కానీ సార్వ భౌమాధికారమే సుప్రీం అని కామెంట్ చేశారు. ప్రతి అంగుళంభూమిని కాపాడుకోగలిగే సత్తా మనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. మన దేశం శాంతిని కోరుకుంటుందని.. కాదని రెచ్చగొడితే తిరిగి బదులి వ్వగల దమ్ముందని చెప్పారు.

అడ్డుకున్నరు..

భరతమాతను సవాల్ చేసిన వాళ్లకు తగిన గుణపాఠం చెప్పామని ప్రధాని మోడీ అన్నారు. ఎవరూ అడ్డుకోలేకపోయిన చైనాను జవాన్లు అడ్డుకున్నారని కొనియాడారు. మన సైన్యంపై దేశానికి అంతులేని నమ్మకం ఉందని.. మన దళాలు ఒకేసారి అన్ని రకాలుగా దాడి చేయగలవని చెప్పారు. గతంలో మానిటరింగ్ లేని ప్రాంతాలపై ఇప్పుడు మన నిఘా పెరిగిందని వివరించారు. కొన్నేళ్లుగా డిఫెన్స్, మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మన పెట్రోలింగ్ కెపాసిటీ పెరిగిందని తెలిపారు. సైనికుల త్యాగం వృథా కాదని మోడీ అన్నారు. కాగా, ఆల్ పార్టీ మీటింగ్ కు ఆప్, ఆర్డీ, జే జేడీఎస్, మజ్లిస్ సహా కొన్ని పార్టీలను ప్రభుత్వం ఆహ్వానించలేదు.

కేంద్రానికి అండగా ఉంటం: ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్

ఇండియా–చైనా బార్డర్లో  ఘర్షణ తలెత్తినందున ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయాలని ప్రధానిని ఆయన కోరారు. ఇలాంటి టైంలో కేంద్ర ప్ర భుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఇండియా ఎదగడం చైనాకు ఇష్టం లేదని, అందుకే కయ్యానికి కాలుదువ్వుతున్నదన్నా రు. ప్రధాని మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో టీఆర్ ఎస్ చీఫ్ హోదాలో కేసీఆర్ తన అభిప్రాయాలు చెప్పారు. ‘‘చైనా, పాకిస్తాన్ దేశాలకు సొంత దేశాల్లో అంతర్గ సమస్యలున్నప్పుడు బార్డర్ లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇండియాతో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్నది. గల్వాన్ లోయ లాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. చైనాతో మన దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి మనం చాలా వ్యూహాత్మకంగా ఉండాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చైనా బద్నామైంది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. చైనా దిగుమతులు ఆపాలనడం తొందరపాటేనని, మనది శాంతిని కోరుకునే దేశమని, అదే టైంలో సహనానికి కూడా హద్దు ఉంటుందని సీఎం చెప్పారు. ఎవరైనా మన మీదికి వస్తే తీవ్రంగా ప్రతిఘటించాలని అన్నారు. దేశ రక్షణ, ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్ద ని పేర్కొన్నారు. “ఈ టైంలో దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాన మంత్రికి అండగా నిలవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కూడా అండగా ఉంటారు’’ అని స్పష్టం చేశారు. ‘‘చైనా నుంచి వస్తువుల దిగుమతులు ఆపాలనే అభిప్రాయాలు వస్తున్నయి. అది తొందర పాటు చర్య అవుతుంది. దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాలి. ప్రజలకు అందుబాటు ధరల్లో దొరకాలి. మనం ఈ విషయాలపై ఫోకస్ పెట్టాలి’’ అని పేర్కొన్నారు.

Latest Updates