ఆర్నాబ్ గోస్వామిపై దాడి : ఇద్దరు నిందితుల అరెస్ట్

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, అతని భార్యపై దాడి చేసిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్నాబ్ గోస్వామి కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించారు.

ఆ విమర్శల తరువాత ఆర్నాబ్ అతని భార్యపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంక్ బాటిళ్ల తో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాడికి ప్రయత్నించిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.  సెక్షన్ 504, 341 కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి అనంతరం నిందితుల్ని అరెస్ట్ చేసే సమయంలో నిందితులు ఆర్నాబ్ గోస్వామి అసలు జర్నలిస్టే కాదని, మొదట మీరు  ఆ విషయం గురించి తెలుసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యల్ని ఏఎన్ ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Latest Updates