పెంపుడు గాడిదకు ఫస్ట్ బర్త్ డే చేసిన హాలీవుడ్ నటుడు

కొందరు జంతు ప్రేమికులు తమకు ఇష్టం ఉన్న జంతువును పెంచుకుంటూ ఉంటారు.వాటి ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ ఇంట్లోని వ్యక్తిని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు. వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూ ప్రేమగా చూసుకుంటారు. కొందరు డాగ్స్ ను పెంచుకుంటే…మరికొందరు పిల్లులను, పక్షులతో పాటు వారికి ఏది ఇష్టం ఉంటే వాటిని పెంచుకుంటారు.

హాలీవుడ్ కండల వీరుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ మాత్రం గాడిదను పెంచుకుంటున్నారు. దానికి లులు అని పేరు కూడా పెట్టారు. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గాడిద ఏజ్ ప్రస్తుతం వన్ ఇయర్. దీంతో దాని పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు ఆర్నాల్డ్. ఈ సందర్భంగా దాన్ని ఎంతో ముద్దుగా దగ్గరకు తీసుకుని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కరోనా పై తన వంతు సాయంగా రూ.10 కోట్లు విరాళంగా అందించారు. కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న డాక్టర్ల కోసం 50వేల మాస్కులను ఉచితంగా అందించారు.

 

Latest Updates