GHMC ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ రేపు(శుక్రవారం) జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పుర్తి చేశారు అధికారులు. 30 సర్కిళ్లలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 150 వార్డుల ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఒక్కో హాల్ లో 14 కౌంటింగ్  టేబుల్స్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఒక్కో రౌండ్ లో 14 వేల ఓట్లు లెక్కించనున్నారు.

ప్రతి కౌంటింగ్ హాల్లో ఓ రిటర్నింగ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్  ప్రాసెస్ ను పర్యవేక్షించనున్నారు. లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి కౌంటింగ్ సెంటర్లో ఓ అబ్జర్వర్ ను  నియమించారు. పోటీలో ఉన్న క్యాండిండేట్లు ఒక్కో కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక్కో ఏజెంట్ ను  నియమించుకోవచ్చు. క్యాండిడేట్ లేదా క్యాండిడేట్ తరఫున ఎలక్షన్ ఏజెంట్,  అడిషనల్ కౌంటింగ్ ఏజెంట్ ను మాత్రమే కౌంటింగ్ టేబుల్ దగ్గరకు అనుమతిస్తారు. హాల్లో లెక్కింపు ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరా లేదా వీడియోగ్రఫీతో రికార్డు చేయనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు రిలీఫ్ ఏజెంట్ ను ఇవ్వబోమని, కౌంటింగ్ హాళ్లలోకి సెల్ ఫోన్లను అనుమతించబోమన్నారు అధికారులు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.

Latest Updates