వలస కార్మికుల కోసం కాంగ్రెస్‌ పార్టీ బస్సుల ఏర్పాట్లు

వలస కార్మికులకోసం కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వారు తమ సొంత ఊళ్లకు వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దుబ్బాక నర్సింహారెడ్డి… నల్లగొండ నుంచి ఒరిస్సాకు వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన బస్సులను క్లాక్ టవర్ సెంటర్ నుంచి ప్రారంభించారు. వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు ఉత్తమ్. లాక్ డౌన్ పేరుతో వలస కార్మికులను గాలికి వదిలేశారని విమర్శించారు. వాళ్లను సొంత ఊర్లకు పంపడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్నారు. వలస కూలీల సంక్షేమానికి ఒక్క కాంగ్రెస్ పార్టీనే కృషి చేసిందని తెలిపారు. సోనియాగాంధీ సూచనతో రాష్ట్రంలోని వలస కార్మికులను సొంత ఊర్లకు పంపేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసిందన్నారు. నల్లగొండ నుంచి ఒరిస్సా కార్మికులను తమ పార్టీ సొంత డబ్బుతో బస్సులో పంపించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వలస కార్మికులను వారి సొంతూళ్లకు పంపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Latest Updates