సిరిసిల్ల జిల్లాలో రోజుకు వెయ్యి కరోనా పరీక్షలకు ఏర్పాట్లు: మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇవాళ(సోమవారం)  జిల్లా ఆస్పత్రిలో కోవిడ్  ఐసీయూ, 40 పడకల ఆక్సిజన్‌ వార్డుతో పాటు కోవిడ్  అంబులెన్స్ లను కేటీఆర్‌ ప్రారంభించారు. దీంతో పాటు పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈఈ కార్యాలయ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… జిల్లా ఆస్పత్రికి సీఎస్‌ఆర్‌ పథకం కింద రూ. 2.28 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు వెయ్యి కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్‌ కిట్లు అందిస్తామన్నారు. బాధితుల సంఖ్య పెరిగితే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను కూడా ఐసోలేషన్‌ కేంద్రాలుగా వాడుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్.

Latest Updates