రేపే మంత్రివర్గ విస్తరణ : రాజ్ భవన్ లో హడావుడి

సెక్రటేరియట్ : రేపు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రుల ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు రాజ్ భవన్ లో చురుగ్గా జరుగుతున్నాయి. GAD, ప్రొటోకాల్ అధికారులు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎమ్మెల్యేలకు, ఇతర రాజకీయ పార్టీ నేతలకు, ప్రభుత్వ సలహాదారులకు, కార్పొరేషన్ చైర్మన్ లు, నామినేటెడ్ పదవులు పొందిన వాళ్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు… మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఇన్విటేషన్ లు పంపుతున్నారు GAD అధికారులు.

ఎంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ముందస్తుగా 15 కొత్త ఇన్నోవా క్రిస్టా వాహనాలను సిద్ధం చేసినట్టుగా ప్రోటోకాల్ అధికారులు చెప్పారు. రాజ్ భవన్ లో ఈ రోజు రాత్రి నుంచి షామియానాలు, కుర్చీలు, సౌండ్ సిస్టం, పూల అలంకరణ ఏర్పాట్లు చేయనున్నారు అధికారులు. మంగళవారం రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

Latest Updates