బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవానికి ఏర్పాట్లు

హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో దేవాదాయశాఖ, జీహెచ్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

ఈనెల 23న  ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఎల్లమ్మ కల్యాణం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది పరిస్థితుల దృష్ట్యా పురోహితుల సమక్షంలో మాత్రమే కల్యాణోత్సవం నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భక్తులెవరు అమ్మవారి కల్యాణోత్సవానికి రావద్దని మంత్రి సూచించారు. పెళ్లి తంతు ప్రక్రియ అంతా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని….భక్తులు సహకరించాలని కోరారు.

లాక్ నిబంధనలన్నింటినీ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తలసాని.

Latest Updates