అయోధ్యలో 5 లక్షల దీపాలు వర్చువల్​గా వెలిగించేందుకు ఏర్పాట్లు

లక్నో: అయోధ్యలో ప్రతీ సంవత్సరం దీపావళికి నిర్వహించే దీపోత్సవ్‌‌‌‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు యూపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. నవంబరు 13న 5.51 లక్షల మందితో దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా వర్చువల్‌‌‌‌గా కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించి, వెబ్‌‌‌‌పోర్టల్‌‌‌‌ తయారు చేసే పనిలో సర్కారు ఉంది. ఈ పోర్టల్‌‌‌‌లో రామ్‌‌‌‌లల్లా విరాజ్మాన్‌‌‌‌ ఫోటో ఉంటుంది. దీని ముందే వర్చువల్‌‌‌‌ దీపాలు వెలిగిస్తారు. స్టీల్‌‌‌‌,  బ్రాస్‌‌‌‌ కలర్‌‌‌‌‌‌‌‌ దీపాల స్టాండ్‌‌‌‌లను ఎంపిక చేసుకునే చాన్స్‌‌‌‌ కూడా ఈ పోర్టల్‌‌‌‌లో ఉంటుంది. దీపాలు వెలిగించిన తరువాత, భక్తుల వివరాలతో రామ్‌‌‌‌లల్లా ఫోటో పట్టుకున్న సీఎం యోగి నుంచి థ్యాంక్స్‌‌‌‌ చెప్తూ డిజిటల్‌‌‌‌ లెటర్‌‌‌‌‌‌‌‌ దీపాలు వెలిగించిన వారికి వస్తుంది. కరోనా గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ప్రకారం దీపావళి వేడుకలు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌‌‌ అధికారులను ఆదేశించారు. రామ్‌‌‌‌లల్లా విగ్రహం వద్ద హారతిలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌‌‌ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పీఎం మోడీ వర్చువల్‌‌‌‌గా హాజరవుతారని రాష్ట్ర సర్కారు స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో చెప్పింది.

 

 

Latest Updates