మహిళలను వేధిస్తున్న యువకుడి అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీకి చెందిన ప్రైవేట్ ఎంప్లాయ్ మోట దుర్గాప్రసాద్(23) సోషల్ మీడియాలో మహిళల ఫోన్ నంబర్లు తీసుకుని వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నాడు. న్యూడ్ ఫొటోస్ పంపాలని, లేదంటే మీ ఫోన్ నంబర్ ను పోర్న్ సైట్స్ లో పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఓ మహిళా అడ్వకేట్ కు ఇలాగే మెసేజ్ లు పంపడంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేశారు. దుర్గాప్రసాద్ ను పోలీసులు శనివారం గుర్తించి అరెస్ట్ చేశారు. అతడిపై 2017లోనే నల్లగొండ జిల్లాలో ఒకటి, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 వేధింపుల కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates