సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి యత్నించిన ABVP కార్యకర్తల అరెస్ట్‌

హైదరాబాద్‌లో ABVP కార్యకర్తలు సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు యత్నించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ABVP సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీసు వైపు వస్తున్న ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.  ముట్టడికి యత్నించిన ఏబీవీపీ జాతీయ నాయకులు ప్రవీణ్‌, దిలీప్‌లను అరెస్ట్‌ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ABVP కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ABVP ముట్టడికి యత్నించడంతో సీఎం క్యాంప్ ఆఫీసు దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

Latest Updates