పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

యాదాద్రి వెలుగు: పేకాట ఆడుతున్న పలువురిని ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని మాసాయిపేట గ్రామంలోని ఓ మామిడితోటలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో మొత్తం 16మంది పేకాట ఆడుతుండగా పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.4,09,190, నగదు..15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డిల పర్యవేక్షణలో దాడులు నిర్వహించినట్లు సీఐ వెల్లడించారు.

హుజూర్ నగర్‌, వెలుగు: పట్టణంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  పట్టణంలోని ఓ ఇంట్లో బుధవారం సాయంత్రం పేకాట ఆడుతున్నారనే సమాచారం అందింది. దీంతో దాడి చేయగా పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు రూ.3520, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Latest Updates