ఇథలిన్ గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు: పండ్లు మాగబెట్టేందుకు ఇథలిన్ వాడుతున్న గ్యాంగ్‌‌ను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.సిటీలో పండ్లవ్యాపారం చేసే దాసరి వెంకటేశ్, ఇంతియాజ్ అలీ,  అమిత్ అగర్వాల్, ఇషాక్ ‌‌మామిడి, బొప్పాయి, అరటి కాయలపై ఇథలిన్‌‌ చల్లి వాటిని పండ్లుగా చేసి, మార్కెట్లలో అమ్ముతున్నారు. ఇతర వ్యాపారులకూ సప్లయ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సికింద్రాబాద్, కొత్తపేట, రాంగోపాల్ పేట, మారేడుపల్లి మార్కెట్ ప్రాంతాల్లో శుక్రవారం దాడులు చేసి.. ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. రూ. 7 లక్షల 3,329 ఇథలిన్ కెమికల్ బాక్స్ లు, వాటిని సప్లయ్ చేస్తున్న వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు

Latest Updates