క్రికెటర్ షమీకి అరెస్ట్ వారెంట్

ఇండియన్ బౌలర్ మహమ్మద్ షమీకి కోల్ కతాలోని అలీపోర్ కోర్టు అరెస్ట్  వారెంట్ జారీ చేసింది. గృహహింస కేసులో షమీ ,అతని సోదరుడు హసీద్ అహ్మద్ 15 రోజుల్లో లొంగిపోవాలంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2108లో షమీ భార్య హసీన్  జహన్ అతనిపై ఆయన సోదరుడు కుటుంబ సభ్యలుపై వేదిస్తున్నారంటూ కేసు పెట్టింది. పోలీసులు షమీపైన 498ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.  షమీ భార్య 2019 ఏప్రిల్  లో కూతురుతో కలిసి అతని ఇంటి దగ్గరకు వచ్చి ఆందోళన చేయగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై విడుదల అయ్యింది. హసీన్ ఆరోపణలు చేసినప్పటి నుంచి షమీ ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు. లేటెస్ట్ గా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.

షమీ ప్రస్తుతం వెస్టిండీస్ తో రెండో టెస్టు ఆడుతున్నాడు. షమీ 70 వన్డేల్లో 131 వికెట్లు తీయగా.. ఇటీవల తన 42 వ టెస్ట్ మ్యాచ్‌లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 2019 ప్రపంచ కప్ లో కీలక పాత్ర పోషించాడు.

 

Latest Updates