ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లకు అరెస్ట్ వారెంట్

Arrest warrants issued to 500 smugglers, thirupathi task force police
  • తిరువన్నామలై జిల్లా ఎస్పీ తో తిరుపతి టాస్క్ ఫోర్స్ ఐజి సమావేశం.
  • వారంట్లు జారీకి తమిళ పోలీసుల సహకారం.
  • 500 వారంట్లు జారీ చేయనున్న పది టాస్క్ ఫోర్స్ బృందాలు.

తిరుపతి : తమిళనాడుకు చెందిన కొందరు స్మగ్లర్లు అక్రమంగా తిరుపతి శేషాచలం అడువుల్లోకి  వచ్చి ఎర్ర చందనం దుంగల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై సోమవారం తిరుపతి తిరుపతి టాస్క్ ఫోర్స్ ఐజి కాంతారావు తమిళనాడు లోని  తిరువన్నామలై జిల్లా పోలీసు ఎస్పీ సిబి చక్రవర్తి తో సమావేశమయ్యారు.

అక్రమ రవాణా చేస్తున్న ఆ స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు ఏపీ టాస్క్ ఫోర్స్ గతంలోనే చర్యలు చేపట్టింది. తిరువన్నామలై జిల్లా జవ్వాది మలైకు చెందిన 500 మంది స్మగ్లర్లకు వారంట్లు జారీ చేయనున్నారు.  దీనికి గాను టాస్క్ ఫోర్స్ నుంచి పది టీమ్ లు ఐజితో  తిరువన్నామలై చేరుకున్నారు.

ఈ విషయంపై ఐజి కాంతారావు మాట్లాడుతూ ఎర్రచందనం పరిరక్షణకు తమిళనాడు పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ కు చెందిన పది టీమ్ లకు తమిళనాడు పోలీసులు ఎస్కార్ట్ కానున్నట్లు తెలిపారు. ఇందులో తమిళనాడు కు చెందిన డీఎస్పీలు, సిఐలు, ఎస్ ఐలు ఉన్నారని తెలిపారు. వారి సహకారంతో వారంట్లు జారీ చేసి తద్వారా విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.‌ ఈ సమావేశంలో  ఐజితో పాటు డీఎస్పీ వెంకట రమణ, ఎసిఎఫ్ కృష్ణయ్య, డిఎఫ్ ఒ డీఎన్ ప్రసాద్, సిసి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates