ముస్లిం వ్యక్తి నుంచి డెలివరీ తీసుకోలేదని అరెస్ట్

థానే: ముస్లిం వ్యక్తి నుంచి డెలివరీ తీసుకోవడానికి నిరాకరించినందుకు థానే జిల్లా కాశీమిరా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గుంజన్ చతుర్వేది ఇంటికి ఆర్డర్ చేసిన గూడ్స్ ఇవ్వడానికి ఓ డెలివరీ మ్యాన్ వెళ్లాడు. అలా వెళ్లిన డెలివరీ మ్యాన్ ను అతడి పేరు చెప్పాల్సిందిగా చతుర్వేది అడిగాడు. అతడు తన పేరు చెప్పగానే ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా గుర్తించిన చతుర్వేది.. తాను ముస్లిమ్స్ నుంచి ఏదీ తీసుకోనని తెగేసి చెప్పాడు. ఐపీసీ సెక్షన్ 295 (ఏ) కింద మతపరమైన భావాలను భంగపరిచినందుకు చతుర్వేదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest Updates