పాక్ – భారత్ మధ్య ఏ రైలు నడవనియ్యను

భారతదేశం నుండి మరో రైలు సర్వీసును నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ నేడు ప్రకటించింది. గురువారం ఢిల్లీ-లాహోర్ ల మధ్య ప్రయాణించే సంజౌటా  ఎక్స్ ప్రెస్ సేవలను నిలిపివేసిన పాక్ ప్రభుత్వం.. శుక్రవారం  థార్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను (జోధ్‌పూర్-కరాచీ) కూడా నిలిపివేస్తున్నట్టు ఆ దేశ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు.  జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగిస్తూ..  మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ను రద్దు చేయడంతో  పాక్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది.

ఈ విషయంపై మంత్రి షేక్ రషీద్ మాట్లాడుతూ..  థార్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మూసివేయాలని మేము నిర్ణయించుకున్నామన్నారు. తాను రైల్వే మంత్రిగా ఉన్నంతవరకు, పాకిస్తాన్ , భారత్ ల మధ్య ఏ రైలు కూడా ప్రయాణించదు” అని అన్నారు.వారానికోసారి ప్రయాణించే ఈ థార్ ఎక్స్‌ప్రెస్ రైలు రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లా మునాబో నుంచి పాకిస్తాన్‌లోని ఖోక్రాపర్ మధ్య నడుస్తుంది.

Latest Updates