ఢిల్లీ రెస్టారెంట్లో ఆర్టికల్​ 370 థాలి

ప్రస్తుతం దేశంలో రెండే హాట్​ టాపిక్​లు. ఒకటి ఆర్టికల్​ 370 రద్దు, రెండోది చంద్రయాన్​ 2 ప్రయోగం. రెండోదాని గురించి కాసేపు పక్కనపెడదాం. ఆర్టికల్​ 370 రద్దు గురించి మాట్లాడుకుందాం. దాన్ని రద్దు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే, ఢిల్లీలోని ఓ రెస్టారెంట్​ యజమాని కొంచెం కొత్తగా ఆలోచించాడు. దాని పేరు మీదే ఓ స్పెషల్​ థాలిని కస్టమర్లకు పరిచయం చేశాడు. అదే ఆర్టికల్​ 370 థాలి. ఆర్డర్​ 2.1 అనే రెస్టారెంట్​ ఈ స్పెషల్​థాలిని తయారు చేస్తోంది. దానికే యునైటెడ్​ ఇండియా థాలి అన్న ఇంకో పేరు కూడా ఉంది. కాశ్మీర్​ ఎప్పుడూ ఇండియాలో భాగమేనని, కాబట్టి అందుకు తగ్గట్టు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ ఆర్టికల్​ 370 థాలిని ప్రవేశపెట్టిందన్నమాట రెస్టారెంట్​. మరి, అంత స్పెషల్ థాలి తినాలంటే పైసలు కూడా బాగానే వదిలించుకోవాలి. అవును మరి, వెజ్​ తాలి అయితే ₹2,370, మాంసంతో కావాలంటే 2,669 రూపాయలను పర్సుల నుంచి తీయాల్సిందే. జమ్మూకాశ్మీరోళ్లకైతే డిస్కౌంట్​ కూడా ఉంది. ఆ రాష్ట్రానికి చెందినోళ్లు వాళ్ల ఐడీ కార్డులను చూపిస్తే ₹370 తగ్గిస్తారు. తాలి ఎంఆర్​పీలో ₹170ను కాశ్మీర్​ రిలీఫ్​ ఫండ్​కు పంపిస్తారట. వెజ్​ థాలిలో కాశ్మీరీ పులావ్​, కాశ్మీరీ కి రోటీ, ఖుమానీ కి రోటీ, నద్రు కి షమీ, దమ్​ ఆలూ, కవాను వడ్డిస్తారు. మాంసం థాలిలో వెజ్​ థాలిలో పెట్టే వాటితో పాటు అదనంగా రోగన్​ జోష్​ పెడతారట. ఆ రెస్టారెంట్​ ఇలా కాన్సెప్ట్​ థాలిలను పెట్టడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు మోడీ జీ 56 ఇంచ్​ థాలి, బాహుబలి పిచర్​ వంటి స్పెషల్​ ఫుడ్డును కస్టమర్లకు రుచి చూపించింది.

 

Latest Updates