కృత్రిమ గర్భం..అమ్మకాని అమ్మ రాబోతోంది

పుట్టుక కంటే ముందు తొమ్మిది నెలలు తల్లి గర్భంలోనే గడిచిపోతాయి. కానీ పిండం ఎదుగుదలకు ఈ సమయం చాలా కీలకం. కొన్నిసార్లు నెలలు నిండకముం దే బిడ్డలు భూమ్మీదకు వస్తుంటారు.వీళ్లను ఇంక్యు బేటర్లలో పెట్టి వయసు వచ్చే దాకా ఇన్ ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్గం ఇదొక్కటే. మరికొద్ది రోజుల్లో ఇంకో ఆప్షన్ ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. అదే ‘కృత్రిమ గర్భం ’. చూడటాని కి ప్లాస్టిక్ సంచిలా ఉంటుంది. నిజమైన గర్భంలా ఉమ్మ నీళ్లు ఉంటాయి. బొడ్డు తాడు నుంచే బిడ్డకు పోషకాలు అందుతాయి. ఇటీవలే కొందరు నెలలు నిండని పిల్లల కోసం సైంటిస్టులు వీటిని ఐదు రోజుల పాటు వాడారు. నెలలు నిండని పిల్లలు తక్కువ బరువు ఉంటారు. వారి అవయవాలు సరిగా ఎదగవు. ఈ సమస్యల్ని సులువుగా ట్రీట్ చేసేలా వెస్టర్న్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, తొహోకు యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు కృత్రిమ గర్భాన్ని కనిపెట్టారు. ముఖ్యం గా 28 వారాలు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలకు కృత్రిమ గర్భం బాగా ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. తల్లి గర్భంలో ఉండే పరిస్థితులను కృత్రిమ గర్భంలో కల్పించేందుకు చాలా కృషి చేసినట్లు చెప్పారు. పోషకాలు, గుండె స్పందనలు,మెదడు పని తీరు అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నట్లు వివరించారు. కృత్రిమ గర్భం అందుబాటులో తేవడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుందని తెలిపారు.

Latest Updates