సాధనకు ఉందో వేదిక

Artists got a platform to practice their programs

సిటీలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు. తమ కళల ప్రదర్శనకు చాలా వేదికలుఉన్నాయి. కానీ ప్రాక్టీస్ చేసుకునేందుకు అనువైన ప్రదేశాలు లేవు. కళాకారులు తమలోని ప్రతిభకు మరింత పదును పెట్టుకోవడం కోసం మొదలైందే నృత్య – ఫోరం ఫర్ పెర్ఫామింగ్ ఆర్స్ట్. ఇక్కడికి ఎవరైనా వెళ్లొ చ్చు. సాధన చేసుకోవచ్చు. తోటి కళాకారులతో కలిసిపోయి తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. వీటితోపాటు చర్చాగోష్టి లు పెట్టుకుని వివిధ అంశాల గురించి చర్చించుకోవచ్చు. అది ఎక్కడుందో తెలుసుకోం డి.

అనువైన స్థలం లేకనే ఏర్పాటు

బంజారాహిల్స్ రోడ్ నెం.3లో నృత్య ఫోరంఫర్ పెర్ఫామింగ్ ఆర్స్ట్ ఉంటుం ది. ఆర్టిస్టు లు పెర్ఫామెన్స్ చేసేందుకు చాలా వేదికలున్నాయి.కానీ, ప్రాక్టీస్ చేయడానికి లేవని గుర్తించిన వెంకట్ 2016 లో నృత్య ఫౌండేషన్ కి శ్రీకారం చుట్టారు. ఫిజికల్ పెర్ఫామెన్స్  చేసే ఆర్టిస్టు లకు రవీం ద్రభారతి, త్యాగరాయ గాన సభ, శిల్పా-రామం, శిల్పకళా వేదిక, లామకాన్‌‌ వంటి వేదికలుఉ న్నా యి . పెర్ఫామ్ కోసం మినీ థియేటర్స్ ఉంటా యి. అ యి తే ప్రాక్టీస్, రి-హార్సల్స్ కు తగిన ప్రదేశాలు లేవు. దీంతో పెర్ఫా-మింగ్ ఆర్టిస్టు లకు ఒక అనువైన స్థలం ఏర్పాటుచేయాలనుకొని  రోడ్ నెం.3లో స్థలం రెంట్‌‌‌‌కుతీసుకున్నాడు. రిహార్సల్స్ కోసం తీర్చి దిద్దా డు. కొం త మంది ట్రస్టీల సాయంతో ఈ కళాక్షేత్రాన్నినడుపుతున్నారు. ఇక్కడికి ఆర్టిస్టు లు మాత్రమేకాదు ఎవరైనా వెళ్లి కాసేపు హాయిగా గడపొచ్చు.

అన్ని కళలకు వేదిక

అక్కడికి వెళ్లగానే ప్రశాం త వాతావరణంకనిపిస్తుంది. లోపలికి అడుగుపెట్టగానే రచయితలు, ఆర్టిస్ట్ లు తమ ప్రపంచంలో మునిగిపోయి ఉంటారు. లోపలి గదుల్లో కొం తమంది డైరెక్టర్లు , చిత్రకారులు కనిపిస్తారు. గోడలపై అందమైన పెయింటింగ్స్ కనువిందు చేస్తాయి.  పై అంతస్తులో కలర్ ఫుల్ బాటిల్స్ తో కట్టిన వాల్‌‌‌‌ కట్టిపడేస్తుంది. చుట్టుపక్కల చెట్లు, అంతస్తులు అబ్బురపరుస్తుంటా యి. రిహార్సల్స్ స్పే స్, గ్రీన్ రూమ్, పెర్ఫామెన్స్ స్పే స్,బెవరేజెస్, రెస్టా రెంట్ అందుబాటు-లో ఉన్నాయి. పెర్ఫామింగ్ ఆర్స్ట్ లో డ్యాన్స్, మ్యూజిక్,  థియేటర్,  స్టోరీ టెల్లిం గ్,  పోయెట్రీ, స్టాం డ్ అప్ లాంటివి ఉంటాయి. రిహార్సల్స్, డిస్కస్ , న్యూ ఐడియాస్, వర్క్ క్రియేట్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుం ది. ఆడిషన్స్, షూట్స్, మ్యూజికల్ షోస్, బుక్ లాం చెస్ వంటివి ప్రతిరోజు జరుగుతుం-టాయి.ఎగ్జిబిట్‌ కు ఫీజు వసూలు ఆర్టిస్ట్ లు తమ కళను ఎగ్జిబిట్ చేసుకునేందుకు ఆర్ట్ గ్యాలరీ కూడా ఓపెన్ చేశారు. పెయింటింగ్స్ ని కూడా ప్రదర్శించు కోవచ్చు. ఒకగంటకు రూ.150 ఫీజు తీసుకుంటారు.  ఇలా మూడు గంటల వరకు మాత్రమే ఇస్తారు.

పెర్ఫామింగ్ ఆర్టిస్ట్ ల కోసమే..

పెర్ఫామ్ చేసేందుకు సిటీలో చాలావేదికలు ఉన్నాయి. కానీ రిహార్సల్స్‌‌‌‌ కులేవు. దీంతో కళాకారులందరినీ ఒకతాటిపైకి తెచ్చేం దుకు 2016లో ఫౌండేషన్ స్థా పించాను. అనేకమంది కళాకారులు వచ్చి రిహార్సల్స్ చేస్తూ ప్రదర్శనలు ఇస్తున్నా రు. తోటి కళాకా రులతోవర్క్ ని షేర్ చేసుకుం టు న్నారు. ఇక్కడలైవ్ పెర్ఫామెన్స్ లతో పాటు బుక్ రిలీజ్ఫంక్షన్లు కూడా నిర్వ హిస్తుం టారు.ఆర్టిస్ట్ లకు స్పే స్ కల్పిం చ డమే లక్ష్యం. – వెం కట్, నృత్య ఫోరం ఫర్  పెర్ఫామింగ్ ఆర్స్ట్ వ్యవస్థాపకుడు.

Latest Updates