విద్యార్థి నాయకుడి నుంచి కేంద్ర మంత్రి వరకు… జైట్లీ

కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి చెందారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ జైట్లీ చనిపోయారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ…. ఆగస్టు 9న ఎయిమ్స్ లో చేరారు. కిడ్నీ సంబంధిత ఆపరేషన్ తర్వాత…  జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. పరిస్థితి విషమించడంతో.. ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ట్రీట్ మెంట్ జరుగుతుండగానే.. జైట్లీ మృతి చెందారు. ఆయనకు చికిత్స జరుగుతున్న టైంలో….. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

విద్యార్థి నాయకుడి నుంచి కేంద్ర మంత్రి వరకు… 
విద్యార్థి నాయకుడిగా, పార్టీ నేతగా, కేంద్రమంత్రిగా.. అరుణ్ జైట్లీ చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయి. బీజేపీలో ఆయన వేసిన ముద్ర…ఎన్నటికీ చెరగనిదిగా ఉంటుంది. 1952.. డిసెంబర్ 28న ఢిల్లీలో జన్మించారు అరుణ్ జైట్లీ… ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అరుణ్ జైట్లీ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. విద్యార్థి దశలోనే.. ఆయన యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. ఏబీవీపీలో చేరారు. క్యాంపస్ లో ఏబీవీపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. తర్వాతి కాలంలో.. ఢిల్లీ ఏబీవీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కొంతకాలానికే.. ఢిల్లీ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. ఢిల్లీ బీజేపీలో అరుణ్ జైట్లీ క్రియాశీలకంగా వ్యవహరించారు.

ఎమర్జెన్సీ టైంలో 19 నెలులు జైలు..
ఎమర్జెన్సీ టైంలో… అరుణ్ జైట్లీ 19 నెలలు జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక.. జనసంఘ్ పార్టీలో చేరారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన అరుణ్ జైట్లీ.. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. ఆ సమయంలో వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు.. జైట్లీ సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు.

వాజ్ పేయ్ నేతృత్వంలో మంత్రిగా…
1991 నుంచి అరుణ్ జైట్లీ బీజేపీ కార్యవర్గంలో పనిచేశారు. వాజ్ పేయి  నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో.. ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. తర్వాత వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి.. సమర్ధవంతంగా నిర్వర్తించారు. 2009 నుంచి 2014 వరకు.. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు జైట్లీ. 2014లో తొలిసారి అమృత్ సర్ నుంచి పోటీకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి.. అమరీందర్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు.

2019 లో పోటీకి దూరం..
2014లో బీజేపీ అఖండ మెజారిటీతో గెలువగా… ప్రధాని మోడీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో.. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు.. రక్షణ, వాణిజ్య, పరిశ్రమలు, న్యాయశాఖ మంత్రిగానూ జైట్లీ పనిచేశారు. 2019 ఎన్నికల్లో.. ఆరోగ్య కారణాల వల్ల.. అరుణ్ జైట్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తర్వాత…మోడీ కేబినెట్ లో నూ చేరలేదు.

Latest Updates