అరుణ్ జైట్లీ కన్నుమూత

arun-jaitley-passes-away

బీజేపీ నేత,కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ(శనివారం) మధ్యాహ్నం చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన మరణ వార్తతో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా… విషయం తెలియగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీకి వెళ్లారు.

ఆగస్టు 9 నుంచి అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయనకు డయాలసిస్ చేశారు. ఆగస్టు 10 నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి హైల్త్ బులిటెన్ విడుదల చేయలేదు.20వ తేదీ నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు.

అరుణ్ జైట్లీ 1952, నవంబర్‌ 28న న్యూఢిల్లో జన్మించారు. మోడీ మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే కీలకమైన నోట్ల రద్దు, GST వంటి సంస్కరణలను కేంద్రం తీసుకొచ్చింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో 2019 సార్వత్రిక ఎన్నికలకు జైట్లీ దూరంగా ఉన్నారు.

Latest Updates