భారత్ కు చేరుకున్న అరుణ్ జైట్లీ

భారత్ కు తిరిగి వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైద్యం చేయించుకోడానికి అమెరికా వెళ్లారు. దీంతో ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా పియూశ్ గోయల్ కు అప్పగించారు ప్రధాని మోడీ.

శనివారం భారత్ కు చేరుకున్న అరుణ్ జైట్లీ తన ఆనందాన్ని ట్విటర్ ద్వారా వ్యక్తం చేశారు. భారత్ కు తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. కొద్ది రోజుల ముందే జైట్లీ తిరిగి భారత్ కు రానున్నట్లు తెలిసినా.. డాక్టర్ల సలహా మేరకు ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు.

Latest Updates