ప్రతి దాడి తప్పదు: అరుణ్ జైట్లీ

జమ్మూ కశ్మీర్: పుల్వామాలో CRPF పై జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై జరిగిన దాడిని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఇది పిరికి పంద చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదులు ఊహించనంతగా తాము విరుచుకుపడతామని జైట్లీ చెప్పారు.

డెహ్రడూన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఇప్పటికే ట్విటర్ ద్వారా.. హోం మినిష్టర్ రాజ్ నాథ్ సింగ్ ను పరిస్థితులను సమీక్షించాల్సిందిగా కోరారు.

దాడిని చేసింది తామేనని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తెలిపింది. అదిల్ అహ్మద్ దార్ అనే కశ్మీర్ కు చెందిన ఉగ్రవాది దాడికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.

Latest Updates