అరుణోదయ రామారావు హఠాన్మరణం

ప్రజా కళాకారుడు అరుణోదయ రామారావు (65) మృతి చెందారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రికి తరలించారు బంధువులు. మధ్యాహ్నం మరోసారి స్ట్రోక్ రావడంతో చికిత్స పొందుతూ  ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. 40 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలపాత్ర పోషించారు రామారావు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామారావుది కర్నూలు జిల్లా ఆదోని.

 

Latest Updates