నా సభలను బీజేపీ అడ్డుకుంటుంది: కేజ్రీవాల్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తనను పాల్గొనకుండా బీజేపీ అడ్డుకుంటుందని AAP చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ రోజు ఢిల్లీలోని ‘షాకూర్ భస్తీ’లో ఆఫ్ ఏర్పాటు చేసిన భహిరంగ సభలో కేజ్రీవాల్ ప్రసంగించాల్సి ఉండగా.. అనుమతులు లేవన్న కారణంతో ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన కేజ్రీవాల్..  కావాలనే తనపై ఇలాంటి చర్యలకు బీజేపీ పాల్పడుతుందని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాలుగా బీజేపీ సభలకు అనుమతులు ఇస్తున్న ఢిల్లీ పోలీసులు తన సభలకు మాత్రం మోకాలడ్డుతున్నారని చెప్పారు. అయితే ఇదే రోజు.. ఢిల్లీ లోని ‘తిమార్ పూర్’ లో ఆప్ నిర్వహించిన భహిరంగ సభ లో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు.

Latest Updates