కరోనా సమాచారం కోసం ఢిల్లీలో ప్రత్యేక యాప్‌

  • లాంచ్‌ చేసిన సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని హాస్పిటల్‌ బెడ్స్‌, వెంటిలేటర్లు, కరోనా పేషంట్ల సమాచారం తదితర అంశాలను తెలుసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం కొత్త యాప్‌ను లాంచ్‌ చేసింది. “ఢిల్లీ కరోనా” పేరుతో రూపొందించిన ఈ యాప్‌ను సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించారు. దేశ రాజధానిలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు దీన్ని రూపొందించినట్లు అధికారులు చెప్పారు. “ ప్రతి ఒకరికి హాస్పిటల్స్‌, బెడ్లు, వెంటిలేటర్ల సమాచారం ఇచ్చేందుకు మేం యాప్‌ను లాంచ్‌ చేశాం” అని కేజ్రీవాల్‌ అన్నారు. ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌‌లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. యాప్‌ లేని వారు delhifightscorona.in/beds ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు. దీంట్లో డేటా ఉదయం 10 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు ఒకసారి అప్‌డేట్‌ చేస్తారని అన్నారు.

Latest Updates