కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన అజ్ఞాతవ్యక్తి

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి దాడి జరిగింది. ఢిల్లీలోని మోతీ నగర్ లో రోడ్ షో నిర్వహించిన అరవింద్ కేజ్రీవాల్ చెంపపై కొట్టాడు గుర్తు తెలియని వ్యక్తి. రోడ్ షో చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తుండగా హఠాత్తుగా జీపు ఎక్కి కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించాడు. దీంతో అక్కడున్న వారంత ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కేజ్రీవాల్ పై దాడి జరగడం ఇది ఎనిమిదో సారి.

Latest Updates