16న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

ఆప్‌ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ  సీఎంగా ప్రమాణస్వీకారం తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ నెల 16న ఆయన  సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈనెల 16వ తేదీ ఉదయం ఢిల్లీలోని రామలీలా మైదాన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

ఇప్పటికీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ లాంఛనంగా అసెంబ్లీని రద్దు చేశారు. ఇవాళ(బుధవారం) ఉదయం గవర్నర్‌తో కేజ్రీవాల్‌ భేటీ అయ్యారు.15 నిమిషాలపాటు చర్చించారు. మరోవైపు ఆప్‌ ఎమ్మెల్యేలు సమావేశమై కేజ్రీని శాసనసభాపక్షం నేతగా ఎన్నుకోనున్నారు. తర్వాత గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరుతారు. ఆ తర్వాత కేజ్రీ తన సీఎం పదవికి లాంఛనంగా రాజీనామా చేస్తారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గాను 62 సీట్లు సాధించి ఆప్‌ ఘన విజయం సాధించింది.

Latest Updates