చెర్రీ నెక్స్ట్ సినిమా చిరుతోనా.. వెంకీతోనా..

ఓ పక్క హీరోగా మంచి ఫామ్‌‌‌‌లో ఉండి కూడా నిర్మాతగానూ బిజీ అయిపోయాడు రామ్ చరణ్. తండ్రి కోసం ‘సైరా’ను ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఆయన కొరటాల డైరెక్షన్‌‌‌‌లో చేయబోయే సినిమాని కూడా తనే నిర్మిస్తున్నాడు. అయితే వీటి తర్వాత అతడు తీయబోయే సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ మోహన్‌‌‌‌లాల్ నటించిన మలయాళ మూవీ ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌’ రైట్స్‌‌‌‌ తీసుకున్నాడు చెర్రీ. ఇప్పుడు మరో మలయాళ సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్ ‘డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌’ హక్కులు కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది . ఇలా వరుసగా రీమేక్ రైట్స్ తీసుకోవడం ఒక ఎత్తయితే.. వాటిని అతడు ఎవరితో తీయబోతున్నాడు అనే ప్రశ్న మరింత క్యూరియాసిటీని రేపుతోంది. నిజానికి ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌’ను చేయడానికి చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారనే టాక్ ఉంది. కానీ ఆ సబ్జెక్ట్‌‌‌‌కి
ఆయన సూట్ కారేమోననే సందేహం కూడా ఉందట. దాంతో వెంకటేష్‌‌‌‌తో తీస్తే బాగుంటుందని చెర్రీ అనుకుంటున్నాడని సమాచారం. కొందరేమో వెంకీతో ప్లాన్ చేస్తోంది ‘లూసిఫర్’ కాదు, ‘డ్రైవిం గ్ లైసెన్స్’ అంటున్నారు. అసలు స్టార్ హీరోలెవరూ కాదు, యంగ్ మెగా హీరోలతోనే తీస్తారు అనేది మరో వాదన. వీటన్నింటిలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. ప్రచారమైతే జోరుగా సాగుతోంది. ఇంతకీ చెర్రీ మనసులో ఏముందో!

Latest Updates